Advertisement

  • సుశాంత్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేసిన సిబిఐ ..

సుశాంత్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేసిన సిబిఐ ..

By: Sankar Sun, 23 Aug 2020 2:01 PM

సుశాంత్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేసిన సిబిఐ ..


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది..ఇప్పటికే సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు హత్యా అని పలువురు అభిప్రాయపడుతున్న తరుణంలో సిబిఐ తన దర్యాప్తును కొనసాగిస్తోంది..అందులో భాగంగా ఆదివారం పలువురిని ప్రశ్నించింది.

సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని ముంబైలో సీబీఐ బృందం ఉన్న డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌కు ఉదయం వచ్చారు. అనంతరం సుశాంత్ ఇంట్లో కుక్‌గా పనిచేస్తున్న నీరజ్ అక్కడికి వచ్చింది. సుశాంత్ మరణం గురించి సీబీఐ అధికారులు వీరిద్దరిని ప్రశ్నించారు. సుశాంత్ వాడిన ఒక మొబైల్ ఫోన్ నెంబర్ స్నేహితుడైన సిద్ధార్థ్ పిథాని పేరున ఉన్నట్లు ఇటీవల దర్యాప్తులో తెలిసింది.

సుశాంత్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించారు. తన కుమారుడి మరణానికి రియా, ఆమె కుటుంబ సభ్యులు కారణమంటూ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీహార్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించగా సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో గురువారం ముంబైకి చేరుకున్న సీబీఐ అధికారులు శుక్రవారం నుంచి దర్యాప్తు ప్రారంభించారు.



Tags :
|
|

Advertisement