Advertisement

  • ఆయనను తలుచుకోకుండా ఏ షూటింగ్ జరగదు ..ఆయన స్థానం వేరు .c.కళ్యాణ్

ఆయనను తలుచుకోకుండా ఏ షూటింగ్ జరగదు ..ఆయన స్థానం వేరు .c.కళ్యాణ్

By: Sankar Sun, 07 June 2020 08:03 AM

ఆయనను తలుచుకోకుండా ఏ షూటింగ్ జరగదు ..ఆయన స్థానం వేరు .c.కళ్యాణ్

తెలుగు సినిమా చరిత్రలో గ్రేట్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో మొదటి స్థానం లో ఉండే వ్యక్తి మూవీ మొఘల్ రామానాయుడు గారు ..రూపాయి నాణెం మీద ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఒకే ఒక్క ప్రొడ్యూసర్ గా రికార్డు సృష్టించాడు.. సీ కళ్యాణ్, శనివారం నాడు డి. రామరానాయుడు బర్త్ డే సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీ కళ్యాణ్.. రామానాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ramanaidu,suresh babu,c kalyan,tollywood,movie moghal ,తెలుగు,  సినిమా,  గ్రేట్ ప్రొడ్యూసర్స్ , రామానాయుడు, సీ కళ్యాణ్,

ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని బిల్డింగ్స్‌కి రామానాయుడు గారి పేరు ఉంది ఏంటి అని చాలా మంది అనేవారు.. ఈ ప్రతి బిల్డింగ్ పూర్తి కావడానికి రామానాయుడు గారే కారణం. అందుకే ఆయన పేరు. ఆయన ప్రోత్సాహం లేకపోతే బేస్ మెంట్‌లోనే ఆగిపోయేవి అన్నీ. రామానాయుడు గారికి ఆఫీస్‌కి మేం వెళ్తున్నాం అంటే.. సురేష్ బాబు గారికి టెన్షన్ వచ్చేది. ఎందుకంటే.. ఏ బిల్డింగ్ కట్టబోతున్నారు.. డొనేషన్ దేనికోసం అని. ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లడంలో రామానాయుడు గారు ఎప్పుడూ ముందు ఉండేవారు. ఆర్థికంగానూ చాలా సాయం చేశారు. ఆయన లేరు అని మేం ఎప్పుడూ ఫీల్ కాము. ఎందుకంటే ఆయన్ని తలుచుకోకుండా ఏ సినిమా షూటింగ్ జరగదు. నిర్మాత ఎలా ఉండాలన్నది గొప్ప ఉదాహరణ ఆయన.

6 గంటలకు షూటింగ్ అయితే అరగంట ముందే షూటింగ్ లొకేషన్‌లో ఉండేవారు ఆయన. ఇప్పట్లో ఆయనలా ఉండే నిర్మాత ఎవరూ లేరు. ఇప్పటికీ ఆయన మాముందే ఉన్నారని భావిస్తున్నాం అన్నారు నిర్మాత సీ. కళ్యాణ్.

Tags :

Advertisement