Advertisement

  • యూట్యూబ్ లో 250 మిలియన్ వ్యూస్ సాధించిన బుట్టబొమ్మ

యూట్యూబ్ లో 250 మిలియన్ వ్యూస్ సాధించిన బుట్టబొమ్మ

By: Sankar Sun, 05 July 2020 1:35 PM

యూట్యూబ్ లో 250 మిలియన్ వ్యూస్ సాధించిన బుట్టబొమ్మ



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి అల..వైకుంఠపురం సినిమాతో ఇండస్ట్రీ హిట్ రికార్డు కొట్టాడు ..త్రివిక్రమ్ దర్శకత్వంలో , పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అద్భుత కలెక్షన్స్ తో బంపర్ హిట్ గా నిలిచింది ..అల్లు అర్జున్ సినిమా అంటేనే పాటలు , డాన్స్లు ఒక స్థాయిలో ఉంటాయి ..అభిమానులు కూడా అదే స్థాయిలో ఊహించుకుంటారు ..అయితే ఈ సారి వచ్చిన అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ పాటలు మరియు డాన్స్ లతో ఉర్రుతలూగించాడు ..ఆ సినిమాలో ప్రతి పాట అద్భుతం అనేలా ఉంది ..థమన్ స్వరపరిచిన బాణీలు అల్లు అర్జున్ స్టెప్స్ తగ్గట్లు ఉన్నాయి అందుకే యూట్యూబ్ లో ఆ పాటలు రికార్డు వ్యూస్ సాధిస్తున్నాయి ..

ముఖ్యంగా ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ', 'రాములో.. రాముల' ఈ రెండు పాటల హవాను బ్రేకులేసే సాంగ్ మరోటి రాలేదు. దీంతో వ్యూస్ పరంగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి ఈ రెండు సాంగ్స్. కాగా తాజాగా 'బుట్టబొమ్మ' సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి రికార్డ్ నెలకొల్పింది.

ఇప్పటిదాకా చూస్తే 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్‌లో 250 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి పరుగులు పెడుతోంది. మరోవైపు ఎందరో సెలబ్రిటీలు ఈ సాంగ్‌పై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ హవా చూసి బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ బుట్ట బొమ్మ కు టిక్ టాక్ చేయడంతో అది ఇంకా పాపులర్ అయింది ..

Tags :
|

Advertisement