Advertisement

  • 'బుట్టబొమ్మ' బాగా నచ్చింది ..యూట్యూబ్ లో అత్యధిక లైక్స్ వచ్చిన తెలుగు పాటగా రికార్డు ..

'బుట్టబొమ్మ' బాగా నచ్చింది ..యూట్యూబ్ లో అత్యధిక లైక్స్ వచ్చిన తెలుగు పాటగా రికార్డు ..

By: Sankar Sun, 12 July 2020 1:55 PM

'బుట్టబొమ్మ' బాగా నచ్చింది ..యూట్యూబ్ లో అత్యధిక లైక్స్ వచ్చిన తెలుగు పాటగా రికార్డు ..



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరొక రికార్డు చేరింది ..ఈ ఏడాది ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ అ. ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసి నాన్ బాహుబలి రికార్డ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాదు విడుదలై ఆరు నెలలు గడిచిపోయినా తన రికార్డులకు బ్రేకుల్లేవ్ అంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ లోని ''బుట్టబొమ్మ'' సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సాంగ్ తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న పాటగా నిలిచింది ..తాజాగా పాట యూట్యూబ్ లో రెండు మిలియన్ లైక్స్ సాధించింది..ఇప్పటిదాకా మారె తెలుగు పాటకు ఈ రికార్డు దక్కలేదు ..ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన చిత్రయూనిట్.. ప్రేక్షకలోకానికి కృతజ్ఞతలు చెప్పింది.

థమన్ స్వరకల్పనలో వచ్చిన ఈ పాటల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే వేసిన స్టెప్స్ కు ప్రేక్షకలోకం బ్రహ్మరథం పడుతుంది ..కేవలం సామాన్య ప్రేక్షకులే గాక సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు ..ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఈ పాట మరింత ఫేమస్ అయింది ..


Tags :

Advertisement