Advertisement

  • 'బుట్టబొమ్మ' సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్

'బుట్టబొమ్మ' సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్

By: chandrasekar Mon, 06 July 2020 5:44 PM

'బుట్టబొమ్మ' సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొంది ఈ ఏడాది ఆరంభంలోనే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీ పాటలు, తమన్ అందించిన బాణీలు మరో ఎత్తయ్యాయి. నేటికీ ఎక్కడ చూసినా అవే పాటలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ', 'రాములో.. రాముల' ఈ రెండు పాటల హవాను బ్రేకులేసే సాంగ్ మరోటి రాలేదు. దీంతో వ్యూస్ పరంగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి ఈ రెండు సాంగ్స్.

కాగా తాజాగా 'బుట్టబొమ్మ' సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటిదాకా చూస్తే 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్‌లో 250 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి పరుగులు పెడుతోంది. మరోవైపు ఎందరో సెలబ్రిటీలు ఈ సాంగ్‌పై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ హవా చూసి బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 'అల.. వైకుంఠపురములో' మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ మాస్ కిక్ ఇవ్వనున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags :
|

Advertisement