Advertisement

  • 13 ఏళ్ళ తర్వాత విడుదల చేయనున్న బొమ్మరిల్లు... విషయమే౦టంటే...?

13 ఏళ్ళ తర్వాత విడుదల చేయనున్న బొమ్మరిల్లు... విషయమే౦టంటే...?

By: chandrasekar Sat, 07 Nov 2020 12:13 PM

13 ఏళ్ళ తర్వాత విడుదల చేయనున్న బొమ్మరిల్లు... విషయమే౦టంటే...?


బొమ్మరిల్లు సినిమా 13 ఏళ్ళ తర్వాత విడుదల కాబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ఇది కూడా ఒకటి. తండ్రీ కొడుకుల బంధాన్ని అంత అద్భుతంగా చూపించిన సినిమా ఇప్పటి వరకు లేదేమో..? అందుకే బొమ్మరిల్లు ఫాదర్ అంటూ పేరు కూడా పడిపోయింది. ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ కూడా కేరాఫ్ బొమ్మరిల్లు అయిపోయాడు. ఇప్పటి వరకు ఈయన ఎన్ని సినిమాలు చేసినా బొమ్మరిల్లు భాస్కర్ అంటారు. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం తమిళనాట రీమేక్ అయింది. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అదే సమయంలో హిందీలో కూడా రీమేక్ చేసాడు దర్శకుడు అనీష్ బజ్మీ. ఈయన అక్కడ రెడీ లాంటి సినిమాలను రీమేక్ చేసాడు.

అలాగే బొమ్మరిల్లు సినిమాను హిందీలో కూడా 2007లోనే హర్మాన్ భవేజా, జెనీలియా జంటగా ఇట్స్ మై లైఫ్ పేరుతో రీమేక్ చేసాడు అనీస్. కానీ కారణమేంటో తెలియదు మరి.. ఈ అద్భుతమైన కంటెంట్ బాలీవుడ్ లో విడుదలకు నోచుకోలేదు. ఒకటి రెండు కాదు దాదాపు 13 ఏళ్ల పాటు అలాగే బాక్సుల్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం విడుదల కాని సినిమాలకు ఓటిటి మోక్షంగా మారిపోయింది. దాంతో దీన్ని అక్కడ విడుదల చేయబోతున్నారు. నవంబర్ 29న జీ 5లో ఇట్స్ మై లైఫ్ విడుదల కాబోతుంది. దాంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. మరి వెండితెరపై రావాల్సిన సినిమా.. పుష్కర కాలం తర్వాత టీవీలో రాబోతుంది. దీనికి రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags :
|

Advertisement