Advertisement

  • 'బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది’ ఫ‌స్ట్ లుక్

'బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది’ ఫ‌స్ట్ లుక్

By: Anji Thu, 24 Sept 2020 09:29 AM

'బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది’ ఫ‌స్ట్ లుక్

జబర్డస్త్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న షకలక శంకర్..ఆ తర్వాత హీరోగా అవతారమెత్తాడు. ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న శంకర్..తాజాగా అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది’. ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఈ సందర్బంగా దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ..ఇది డైరెక్టర్ గా నా తొలి సినిమా, ఈ సినిమాని ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీ తో తెర‌కెక్కించాము. షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నాను.

ఈ చిత్రంలో షకలక శంకర్ , ప్రియ, అర్జున్ కళ్యాణ్ , రాజ్ స్వరూప్, మధు, స్వాతి, అవంతిక హీనా, రితిక చక్రవర్తి, సంజన చౌదరి నటిస్తుండగా..లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచ్చర్ల నిర్మిస్తున్నారు.

Tags :

Advertisement