Advertisement

  • షాక్ ..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య

షాక్ ..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య

By: Sankar Sun, 14 June 2020 4:15 PM

షాక్ ..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణ వార్త బాలీవుడ్ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. సుశాంత్ అకాల మరణంపై సినీ పరిశ్రమ ఒక్కసారిగా కుంగిపోయింది. సుశాంత్ మృతి వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ ప్రముఖులంతా ట్వీట్లు పెడుతున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సుశాంత్ మృతిపై స్పందించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త వినడం నిజంగా బాధాకరమన్నారు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ అజయ్ ట్వీట్ చేశారు. సోనూ సూద్ సైతం సుశాంత్ మరణ వార్తతో షాక్ తిన్నాడు. నా దగ్గర మాటల్లేవు.. నా గుండె పగిలింది. ఈ వార్త నిజం కాకుండా ఉంటే బావుండు అంటూ సోనూ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా సుశంత్ మృతిపై స్పందించారు. సుశాంత్ మృతి చెందాడన్న వార్త విని ఒక్కసారిగా తాను షాక్‌కు గురయ్యానన్నారు. ఇటీవలే సుశాంత్ నటించిన చిచోరే సినిమా చూశానని తెలిపారు. ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానన్నారు. తాను కూడా ఆ సినిమాలో భాగస్వామ్యం అయి ఉంటే బాగుండేది అని కూడా అన్నానన్నారు. నిజంగా సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో అన్నారు అక్షయ్. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అభిషేక్ బచ్చన్ కూడా ట్వీట్ చేశారు. షాక్ అయ్యాను వండర్ ఫుల్ టాలెంట్. రిప్ సుశాంత్ అని ట్వీట్ చేశారు.

ఇక హీరోయిన్లు పూజా హెగ్డే, దిశా పటాని, కాజల్ అగర్వాల్ కూడా సుశాంత్ మృతిపై స్పందించారు. దిశ హర్ట్ బ్రొకెన్ సింబల్ పెట్టి తన బాధను వ్యక్తం చేసింది. తమన్నా కూడా షాక్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. గుండె పగిలింది. యంగ్ టలెంటెడ్ హీరో చనిపోయాడంటూ తమన్నా తన ట్వీట్‌లో పేర్కొంది. ఇక పూజా హెగ్డే కూడా ఏడుస్తూ ఉన్న ఎమోజీలు పోస్టు చేసి ఏడుపు ఆపడం నా వల్ల కావడం లేదు.. షాక్ అయ్యాను. సుశాంత్ కోసం ప్రార్థిస్తాను అంటూ పోస్టు పెట్టింది.



Tags :

Advertisement