Advertisement

  • కరోనా కష్టకాలంలో డాన్సర్లకు సాయం చేసిన హృతిక్ రోషన్..

కరోనా కష్టకాలంలో డాన్సర్లకు సాయం చేసిన హృతిక్ రోషన్..

By: Sankar Sun, 26 July 2020 8:01 PM

కరోనా కష్టకాలంలో డాన్సర్లకు సాయం చేసిన హృతిక్ రోషన్..



క‌రోనా ప్ర‌భావంతో లాక్ డౌన్ కార‌ణంగా గ‌త నాలుగేళ్లుగా సినిమా షూటింగ్ ల‌కు బ్రేక్ ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో స్టార్ హీరోలు మిన‌హా చాలా మంది న‌టీన‌టులు, డ్యాన్స‌ర్లు ఇత‌ర టెక్నీషియ‌న్ల‌కు ఉపాధి లేకుండా పోయింది. పూట గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు తార‌లు ఇండ‌స్ట్రీలో ఆదాయం లేని వారికి త‌మవంతు సాయమందించారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ 100 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ల‌కు సాయం చేశాడు.

క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో హృతిక్ రోష‌న్ 100 మంది డ్యాన్స‌ర్ల‌కు సాయం చేశాడు. కొంద‌రు డ్యాన్స‌ర్లు ఇండ్ల‌కు వెళ్లిపోగా... మరికొంత‌మంది ఇంటి అద్దె కూడా క‌ట్టే ప‌రిస్థితిలో లేరు. ఇలాంటి స‌మ‌యంలో త‌మ‌కు అండ‌గా నిలవ‌డంపై ఆనందం వ్య‌క్తం చేస్తున్నార‌ని డ్యాన్సర్స్ కో ఆర్డినేట‌ర్ రాజ్ సురాణి తెలిపారు. క‌రోనా బాధితులను ఆదుకునేందుకు ఐ ఫ‌ర్ ఇండియా పేరుతో లైవ్ కాన్స‌ర్ట్ ను నిర్వ‌హిస్తున్నాడు హృతిక్‌రోష‌న్. ఇవాళ రాత్రి 7.30 గంట‌ల‌కు ఫేస్ బుక్ లైవ్ లో వీక్షించండి అని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు..

ఇక కరోనా కష్టకాలంలో బాలీవుడ్ నటులు చాల మంది కష్టాలలో ఉన్న వారిని ఆదుకున్నారు ..సోను సూద్ వలస కార్మికులను తమ యొక్క సొంత ఊర్లకు సొంత డబ్బులతో పంపించిన విషయం తెలిసిందే ..అలాగే అక్షయ్ కుమార్ కూడా పీఎం కెర్స్ నిధికి 30 కోట్లు ఇచ్చాడు..

Tags :
|
|

Advertisement