Advertisement

బాలీవుడ్ లో మరొక దిగ్గజ నటుడు మరణం ..

By: Sankar Thu, 09 July 2020 1:17 PM

బాలీవుడ్ లో మరొక దిగ్గజ  నటుడు మరణం ..



బాలీవుడ్ కు ఈ ఏడాది ఏ మాత్రం కలిసివచ్చినట్లు లేదు .. ముఖ్యంగా బాలీవుడ్‌లో చోటుచేసుకుంటున్న మరణాలు అక్కడి ప్రేక్షకులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ దిగ్గజ నటుల మరణాల చేదు వార్తల నుంచి బయటపడక ముందే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండెపోటు‌తో మృతి చెందడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తాజాగా మరొక నటుడు మృతి చెందారు ..సీనియర్ కమెడియన్ జగదీప్ కన్ను మూసారు ..వయసు పైబడటంతో అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. ఈయన మరణ వార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.జగ్‌దీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ జాఫ్రీ. సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం ‘జగ్‌దీప్’ పేరుతో ఫేమస్ అయ్యారు. బాల నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దాదాపు 400 లకు పైగా చిత్రాల్లో నటించారు. 1970, 80లలో ఆయనలేని బాలీవుడ్ సినిమాలు లేవు.

రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో జగ్‌దీప్ పోషించిన సూర్మా భూపాలీ పాత్ర ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇకపోతే ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాలో సల్మాన్ ఖాన్ తండ్రిగా ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన చేసిన అన్ని పాత్రలు దాదాపు హాస్యప్రధానమైనవే కావడం విశేషం.

Tags :
|
|
|

Advertisement