Advertisement

  • తన తల్లి పాత చీరతో పిల్లలకు కొత్త బట్టలు కుట్టించిన బాలీవుడ్ హీరో...

తన తల్లి పాత చీరతో పిల్లలకు కొత్త బట్టలు కుట్టించిన బాలీవుడ్ హీరో...

By: Sankar Sun, 15 Nov 2020 7:57 PM

తన తల్లి పాత చీరతో పిల్లలకు కొత్త బట్టలు కుట్టించిన బాలీవుడ్ హీరో...


కోవిడ్‌-19 జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే సామ‌న్య ప్ర‌జానీకం నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ దీపావ‌ళి పండ‌గ‌ను దేదీప్య‌మానంగా జ‌రుపుకున్నారు. ఇంటి ముందు దీపాలు వెలిగించ‌డంతో పాటు కొంద‌రు ప‌టాసులు సైతం కాల్చుతూ సంబ‌రాలు జ‌రుపుకున్నారు.

బాలీవుడ్ న‌టి జెనీలియా భ‌ర్త‌, న‌టుడు రితేష్ దేశ్‌ముఖ్‌ త‌న పిల్లల‌తో క‌లిసి వేడుక‌ల్లో మునిగి తేలారు. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇందులో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. రితేష్‌.. అత‌డి త‌ల్లి పాత చీర‌తో కొత్త బ‌ట్ట‌లు కుట్టించారు.

వాటిని హీరోతో పాటు అత‌డి పిల్లలు కూడా ధ‌రించారు. దీంతో తండ్రీకొడుకులు ఒకే రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ వీడియోను జెనీలియా చిత్రీక‌రించారు. ఇక రితేష్ చేసిన ప‌నిని అభిమానులు మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. సూప‌ర్ ఐడియా అని ప్ర‌శంసిస్తున్నారు

Tags :
|

Advertisement