Advertisement

  • మరో సారి హృతిక్ ఫై హాట్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్...!

మరో సారి హృతిక్ ఫై హాట్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్...!

By: Anji Wed, 16 Dec 2020 12:55 PM

మరో సారి హృతిక్ ఫై హాట్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్...!

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కంగనా..తాజాగా ఇక ఇప్పుడు ట్విట్టర్ వేదిక గా మరోసారి హృతిక్ ఫై ట్వీట్స్ చేయడం అభిమానులకు కోపం తెప్పించింది.

గతంలో ‘క్రిష్ 3’ సమయంలో హృతిక్ తనతో ప్రేమలో ఉన్నాడని, ఇద్దరం కలిసి డేటింగ్ చేశామని, ఆతర్వాత విభేదాల కారణంగా విడిపోయామని కంగన తెలిపింది.

ఇక హృతిక్ సతీమణి సుహానే అతడిని విడిచి పెట్టడానికి అమ్మాయిలతో తనకున్న ఎఫైర్లే కారణమని తీవ్ర ఆరోపణలు చేసి పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత కూడా తరుచు హృతిక్ ఫై కామెంట్స్ చేస్తూ వచ్చింది.

“అతడితో విడాకులు అయిన చాలా ఏళ్ల తర్వాతా మళ్లీ ఏడుపు కథ మొదలైంది. నాతో బ్రేకప్ అయ్యి చాలా ఏళ్లైపోయింది. మ‌రో మ‌హిళ‌తో డేట్‌కు వెళ్లేందుకు అతడు ఇష్ట‌ప‌డ‌టం లేదు.

నా వ్యక్తిగత జీవితంలో నేను ముదుకుసాగుతున్నాను.. అతను మాత్రం మళ్ళీ డ్రామా మొదలుపెట్టాడు.

ఆ చిన్నపాటి అఫైర్ గురించి ఇంకెంత దూరం వెళ్తావు హృతిక్ “ అంటూ ట్వీట్స్ తో చెలరేగింది. మరి ఈ ట్వీట్స్ ఫై హృతిక్ రియాక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Tags :

Advertisement