Advertisement

బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా 37వ జన్మదినం

By: chandrasekar Sat, 18 July 2020 3:18 PM

బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా 37వ జన్మదినం


బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా 37వ జన్మదినం జరుపుకుంది. ఈ సంద‌ర్బంగా ఆమె స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, స‌హ‌చ‌రులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ టైగర్‌ జిందా హై మూవీలోని దిల్‌ దియా గలన్‌ అనే పాటలోని స్టిల్‌ను షేర్ చేస్తూ హ్యాపీ బ‌ర్త్‌డే క‌త్రినా అని విషెస్ తెలిపాడు.

దీపికా ప‌దుకొణే త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క‌త్రినా కైఫ్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది. హ్యాపీ బ‌ర్త్‌డే క‌త్రినా నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నాను అని దీపిక పేర్కొంది.

కత్రినా కైఫ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటి ప‌నులు చేస్తూ వాటికి సంబంధించి వీడియోలు షేర్ చేసి ఫ్యాన్‌కి థ్రిల్ క‌లిగించింది. ఒకానొక సంద‌ర్భంలో క‌త్రినా గిన్నెలు క‌డిగిన వీడియోను కూడా షేర్ చేసిన సంగతి అందరికి తెలుసు.

Tags :
|
|

Advertisement