Advertisement

  • రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ..హీరో ఎవరో తెలుసా !

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ..హీరో ఎవరో తెలుసా !

By: Sankar Tue, 25 Aug 2020 11:14 PM

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ..హీరో ఎవరో తెలుసా !


ఇప్పటిదాకా ఇతరుల జీవితాల మీద , మరియు తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ వెళ్లిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరొక సంచలనానికి తెర లేపాడు ..ఈ సారి అత్యంత సంచలన సినిమాతో ముందుకు రాబోతున్నాడు..అదే రామ్ గోపాల్ వర్మ బయోపిక్..

ఈ సినిమాను బొమ్మా క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కిస్తుంది. ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా, మూడు చిత్రాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని దొరసాయి తేజ అనే ఒక నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.ఇందుకు సంబంధించిన షూటింగ్‌ సెప్టెంబర్‌ లో మొదలవుతుందని వర్మ తెలిపారు. ప్రతి పార్ట్‌ రెండు గంటల పాటు ఉండబోతున్నట్లు వర్మ తెలిపారు.

దీని గురించి వర్మ చెబుతూ, ‘ 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు నా వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది. పార్ట్ 1లో నా 20 ఏళ్ళప్పటి రోల్‌లో ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే నాలా గా నటించబోతున్నా’ అని తెలిపారు. రామ్‌ గోపాల్‌ వర్మను ఎంతో మంది ఫాలో అవుతుంటారు. వాళ్లందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :
|

Advertisement