Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా

By: chandrasekar Wed, 12 Aug 2020 7:27 PM

బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా


బిగ్ బాస్ సీజన్ 4 ను కరోనా కారణంగా వాయిదా వేయనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన

మూడు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాల్గవ సీజన్ కోసం టీవీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సీజన్ 2 నాని హోస్ట్ చేశాడు. ఇక మూడవ సీజన్‌ను అక్కినేని నాగార్జున తన మాటలతో, ఆటలతో అదరగొట్టించాడు. ఇక తాజాగా వస్తోన్న ఈ సీజన్ 4 కి కూడా మళ్ళీ నాగార్జునని తీసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. దీనికి సంబందించి ఓ ప్రోమో కూడా విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరున బిగ్ బాస్ సీజన్ 4 మొదలుకానుంది. నాగార్జున ఇప్పటికే ప్రోమో షూట్ చేసాడు. అయితే గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అభిమానులు ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ సరి మారినంత ఆహ్లాదకరంగా తీయనున్నట్లు తెలిసింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సీజన్ 4 భారీ మార్పులతో రాబోతోంది. దీంతో బిగ్ బాస్ సెట్ లో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయట. దీనికి తోడు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసిన తర్వాత 14 రోజులు వారు హోమ్ క్వారంటైన్ ఉండాలి. అన్ని టెస్ట్‌లు చేయించుకుని నెగటివ్ అని రావాలి. ఇలా ఇవన్నీ చెయ్యడానికి కాస్త సమయం పడుతున్న నేపథ్యంలో ఈ షో అనుకున్న సమయానికి ప్రసారం కాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో కొద్దీ రోజులు ఈ సీజన్ ని వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయం బిగ్ బాస్ ప్రేక్షకులకు నిరాశ కలిగించింది.

బిగ్ బాస్ సీజన్లో 4 లో పాల్గొనబోయే కంట్రస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అవడము లీకవడము జరిగింది. ఈ ప్రత్యేక సీజన్ కోసం ఓ 30 మందిని ఫైనల్ చేసి అందులో 15 మందిని హౌస్ లోకి పంపే ఏర్పాట్లు చేస్తోందట బిగ్ బాస్ టీమ్. వారిలో ముఖ్యంగా టాలీవుడ్ హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, మంజూషలతో పాటు నందు, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష కొరియోగ్రాఫర్ రఘు, మంగ్లీ, నోయల్, ప్రియా వడ్లమాని పేర్లు కూడా వినబడుతున్నాయి. చూడాలి మరి ఈ లిస్ట్‌లో ఎంతమంది బిగ్ బాస్ హౌజ్‌లో ఉండనున్నారో. ప్రజలమధ్య మంచి ప్రేరణ పొందిన ఈ కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం కానుండడంతో ప్రేక్షకులు చాలా థ్రిల్లింగా ఎదురుచూస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement