Advertisement

Flash: గంగవ్వ ఇంటి కళ ఏమైందో తెలుసా...?

By: Anji Thu, 29 Oct 2020 06:42 AM

Flash: గంగవ్వ ఇంటి కళ ఏమైందో తెలుసా...?

బిగ్ బాస్ నాలుగో సీజన్ కు మంచి రేటింగ్ వస్తోంది. ఎప్పుడు లేని విధంగా హౌస్ లోకి 50 ఏళ్ల మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు గంగవ్వ. బిగ్‌బాస్ మొదట్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గంగవ్వ అద్భుతంగా రాణించింది.

ఆమెకు ప్రేక్షకాదరణ కూడా బానే లభించింది. గంగవ్వ ముక్కుసూటితనం, అమాయకత్వంతో కూడిన మాటలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. గంగవ్వ అద్భుతంగా రాణిస్తున్న టైంలో ఆమె అనారోగ్యం బారిన పడింది.

గంగవ్వకు హౌస్ లోనే వైద్య సదుపాయాలు అందించారు. అయినా గంగవ్వ ఆరోగ్యం కుదటపడకపోవడంతో.. తప్పనిపరిస్థితుల్లో ఆమెను హౌస్ నుంచి ఇంటికి పంపించారు బిగ్ బాస్. గంగవ్వ హౌస్ నుంచి బయటకు వస్తున్న టైంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది.

పెద్దన్న (బిగ్‌బాస్), చిన్నన్న (నాగార్జున) కలిసి నాకు ఇళ్లు కట్టి ఇవ్వండి అంటూ కోరుకొన్నది. అందుకు బిగ్‌బాస్, నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొంతింటి కల ఆశతో గంగవ్వ తన సొంతూరుకు చేరుకొన్నది.

అయితే ఆమె ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనుమతిస్తే.. దసరా రోజున ఇళ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకొంటానని చెప్పింది. అయితే దసరా రోజున సొంతింటి కలను సాధ్యం చేసుకుందామని అనుకున్న గంగవ్వ ఆశకు సరైన సహకారం అందించలేదు బిగ్ బాస్ నిర్వహుకులు.

అయితే త్వరలోనే గంగవ్వకు రావాల్సిన మొత్తంతోపాటు ఇంటికి అవసరమైన సొమ్మును జమచేసి స్వయంగా నిర్వాహకులే నిర్మాణ బాద్యతను తీసుకొంటారని తెలుస్తోంది.

Tags :

Advertisement