Advertisement

  • రామ్ కొత్త సినిమా 'రెడ్ 'కు ఓటిటిలో కళ్ళు చెదిరే ఆఫర్ ..

రామ్ కొత్త సినిమా 'రెడ్ 'కు ఓటిటిలో కళ్ళు చెదిరే ఆఫర్ ..

By: Sankar Fri, 10 July 2020 10:35 AM

రామ్ కొత్త సినిమా 'రెడ్ 'కు ఓటిటిలో కళ్ళు చెదిరే ఆఫర్ ..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్ పడుతూ లేస్తూ ఉన్న టైం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఒక్కసారిగా రామ్ స్థాయిని పెంచింది ..అప్పటివరకు కేవలం లవర్ బాయ్ సినిమాలు చేస్తూ ఒక వర్గం ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకున్న రామ్ ..ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులలో అభిమానులను సంపాదించుకున్నాడు ..ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ..దీనితో అయన చేస్తున్న తర్వాతి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ..అంచనాలకు తగ్గట్లే రామ్ కూడా రొటీన్ మూవీతో కాకుండా ఈ సారి ఒక సరికొత్త కథతో ముందుకు వస్తున్నాడు ..ఇప్పటిదాకా రిలీజ్ అయినా పోస్టర్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ..

అయితే లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటం, తాజా పరిస్థితులు దృష్ట్యా ఆ థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో కూడా ప్రశ్నార్ధకం గానే ఉండటంతో క్రమంగా ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే రామ్ 'రెడ్' సినిమా హక్కుల కోసం కూడా పోటీ పడుతున్నాయి పలు ఓటీటీ సంస్థలు. గతంలోనే ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల ఆఫర్ రాగా.. తాజాగా 30 కోట్ల రూపాయల మరో భారీ ఆఫర్ వచ్చిందట. దీంతో నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారని టాక్..ఇపుడున్న పరిస్థితుల్లో థియేటర్ లకంటే ఓటిటి అయితేనే బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారు ..ఇప్పటికే చాలా సినిమాలు ఓటిటి లో రిలీజ్ అయ్యాయి ..మరి రెడ్ నిర్మాతలు ఎం చేస్తారో చూడాలి ..

క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన రెడ్ మూవీని శ్రీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. చిత్రంలో రామ్ సరసన నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటించగా.. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. మణిశర్మ బాణీలు కట్టారు

Tags :
|
|
|
|
|

Advertisement