Advertisement

  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రోమో విడుదల ..హోస్ట్ విషయాలను మాత్రం బయటపెట్టని నిర్వాహకులు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రోమో విడుదల ..హోస్ట్ విషయాలను మాత్రం బయటపెట్టని నిర్వాహకులు

By: Sankar Tue, 21 July 2020 1:12 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రోమో విడుదల ..హోస్ట్ విషయాలను మాత్రం బయటపెట్టని నిర్వాహకులు



కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు వినోదాన్ని అందించడం కోసం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రెడీ అయింది..దీనికి సంబందించిన ప్రోమోను మా టీవీ విడుదల చేసింది ... ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతేడాది భారీ రెస్పాన్స్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగించిన నిర్వాహకులు తాజాగా సీజన్ 4 కోసమై అంతా రెడీ చేస్తున్నారు..

నిజానికి కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై ఉండేది. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, పరిస్థితులు తారుమారు కావడంతో కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 4 గురించి గత నెల రోజులుగా ఓ రేంజ్ వార్తలు షికారు చేస్తున్నాయి. సీజన్ 4 హోస్ట్, కంటిస్టెంట్లు వీళ్ళే అంటూ రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో షో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అనే క్యూరియాసిటీ బుల్లితెర ప్రేక్షకలోకంలో పెరిగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదల చేసి అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది స్టార్ మా యాజమాన్యం. ఈ మేరకు అతిత్వరలో షో ప్రారంభం కానున్నట్లు హింట్ ఇచ్చేశారు. అయితే హోస్ట్, కంటిస్టెంట్ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు..ప్రతి సీజన్లో కూడా హోస్ట్ గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది ..తొలి సీజన్లో ఎన్టీఆర్ అద్భుత హోస్టింగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్కు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు ..ఆ తర్వాత హోస్టింగ్ చేసిన నాని , నాగార్జున కూడా తమ స్టైల్ హోస్టింగ్ తో అభిమానులను అలరించారు ...ఇక ఈ నాలుగో సీజన్ ఎవరు చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ..


Tags :
|
|
|

Advertisement