Advertisement

  • బిగ్ బాస్ ప్రోమో విడుదల ..షాకిస్తున్న నాగార్జున లుక్

బిగ్ బాస్ ప్రోమో విడుదల ..షాకిస్తున్న నాగార్జున లుక్

By: Sankar Thu, 13 Aug 2020 10:55 AM

బిగ్ బాస్ ప్రోమో విడుదల ..షాకిస్తున్న నాగార్జున లుక్



బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున బిగ్ బాస్ సీజన్లో4 మరి కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది ..కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సీజన్లో కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు..దీనితో ఈ బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంకి సంబంధించి ఒక్కొక్క‌టిగా ప్రోమోలు వ‌స్తున్నాయి.

తాజాగా నాగార్జున లుక్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో ఆయ‌న ముస‌లి వ్య‌క్తిలా క‌నిపించి అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు గోపి అంటూ చిన్న న‌వ్వు న‌వ్వారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌లో అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి.

సీజన్‌ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను వేలుకు పెట్టుకొని దానితో అనేక విష‌యాలు షేర్ చేస్తూ ఉండేవారు. ఈ సారి గోపి అంటూ మ‌రెవ‌రిని ప‌ట్టుకొస్తారా అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే సీజ‌న్‌3లో టిప్ టాప్‌గా రెడీ అయి వ‌చ్చిన నాగార్జున ఈ సారి ముస‌లి గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడేంట్రా అని నెటిజ‌న్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విష‌యాల‌కి పూర్తి క్లారిటీ రావాలంటే మ‌రి కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి.

Tags :

Advertisement