Advertisement

  • అల్లుడు అదుర్స్ కి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా...?

అల్లుడు అదుర్స్ కి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా...?

By: Anji Mon, 28 Dec 2020 11:50 AM

అల్లుడు అదుర్స్ కి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా...?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్.’ ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్సన్స్ బ్యానర్ పై జి.సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నభానటేష్, అను ఇమాన్యూల్ నటిస్తున్నారు. రాక్షసుడు సక్సస్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేస్తున్న సినిమా ఇది. లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమా దాదాపు పూర్తయ్యింది. సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది.

ఇప్పుడు సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి కానుకగా జనవరి 15న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు.

ఈ మూవీలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 8 ప్యాక్ తో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, సోనూ సూద్ జాయిన్ అయ్యారు.

కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లుక్ బయటకు వచ్చింది. దీనికి మంచి స్పందన వచ్చింది.

అసలు విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫస్ట్ మూవీ ‘అల్లుడు శీను’. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. రౌడీ అల్లుడు, అల్లుడు గారు, అల్లరి అల్లుడు..ఇలా అల్లుడు టైటిల్ తో వచ్చిన సినిమాలన్నీ సక్సస్ సాధించాయి.

ఈ సెంటిమెంట్ ప్రకారం.. అల్లుడు అదుర్స్ ఖచ్చితంగా సక్సస్ అవుతుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. సెంటిమెంట్ వర్కవుట్ అయి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి అల్లుడు అదుర్స్ మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Tags :

Advertisement