Advertisement

  • హిందీలో అల్లు అర్జున్ తర్వాత ఆ రికార్డు సాధించింది బెల్లంకొండ హీరో మాత్రమే

హిందీలో అల్లు అర్జున్ తర్వాత ఆ రికార్డు సాధించింది బెల్లంకొండ హీరో మాత్రమే

By: Sankar Thu, 03 Sept 2020 9:47 PM

హిందీలో అల్లు అర్జున్ తర్వాత ఆ రికార్డు సాధించింది బెల్లంకొండ హీరో మాత్రమే


ద‌క్షిణాది సినిమాల‌కు ఉత్త‌రాదిన మంచి డిమాండ్ ఉంటుంద‌నే విషయం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సౌతిండియాలో తెర‌కెక్కి.. స‌రిగ్గా ఆడ‌ని సినిమాలకు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగానే ఉంటుంది. సౌతిండియా సినిమాల రైట్స్ ద‌క్కించుకున్న హిందీ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాల విష‌యంలో ఎలాంటి కొద‌వ లేదు.

ఎందుకంటే హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ రైట్స్ ద‌క్కించుకున్న డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మంచి లాభాలే వ‌స్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన జ‌య జాన‌కి నాయ‌క హిందీలో ఖూంఖ‌ర్ పేరుతో డ‌బ్ అయింది. యూట్యూబ్ హిందీ వెర్ష‌న్ కు 300 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ త‌ర్వాత అత్య‌ధిక వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచిన రెండో భార‌తీయ చిత్రంగా నిలిచింది. ఈ రెండు చిత్రాలు బోయ‌పాటి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన‌వే కావ‌డం విశేషం. మ‌రోవైపు బెల్లంకొండ న‌టించిన క‌వ‌చం యూట్యూబ్ లో 200 మిలియ‌న్ల వ్యూస్‌, అల్లుడు శీను 100 మిలియ‌న్ వ్యూస్ సాధించాయి. యూట్యూబ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిగిలిన చిత్రాలు యూట్యూబ్ లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

Tags :
|
|
|

Advertisement