Advertisement

  • ప్రభాస్ సూపర్ హిట్ సినిమా ఛత్రపతి హిందీ రీమేక్ లో బెల్లంకొండ వారసుడు...

ప్రభాస్ సూపర్ హిట్ సినిమా ఛత్రపతి హిందీ రీమేక్ లో బెల్లంకొండ వారసుడు...

By: Sankar Fri, 27 Nov 2020 11:58 AM

ప్రభాస్ సూపర్ హిట్ సినిమా ఛత్రపతి హిందీ రీమేక్ లో బెల్లంకొండ వారసుడు...


తెలుగు లో యువ హీరోలలో ఒకడైన బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి తెలుగులో ఇంకా నిలదొక్కుకోలేకపోయాడు ..అయితే అవే సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే భారీగా వ్యూస్ సాధిస్తూ మంచి పేరు తెచ్చిపెట్టాయి ..

అందుకే తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీ లో రీమేక్ చేస్తున్నాడు..దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు.

2005లో ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్‌ ఆఫీస్‌ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లడు శీను సినిమాతో వీవీ వినాయక్‌ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఛత్రపతి రీమేక్‌ తెరకెక్కనుండటం విశేషం. ప్రస్తుతం సాయి శ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Tags :

Advertisement