Advertisement

వైరల్ అవుతున్న బెల్లంకొండ గణేష పోస్టర్..!

By: Anji Mon, 14 Sept 2020 3:30 PM

వైరల్ అవుతున్న బెల్లంకొండ గణేష పోస్టర్..!

బెల్లంకొండ గణేష పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బెల్లంకొండ గణేష హీరోగా ఇంట్రడ్యూజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా నేడు బెల్లంకొండ గణేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వదిలిన బర్త్ డే పోస్టర్స్ లో బెల్లంకొండ గణేష లుక్ అందరనీ ఎట్రాక్ట్ చేస్తోంది. సూపర్ స్టైలిష్ లుక్ లో గణేష్ కనిపిస్తుండటం.. ముఖ్యంగా గడ్డంతో హస్కీ హెయిర్ స్టైల్ తో గణేష్ ఆకట్టుకోవడంతో ఈ బర్త్ డే పోస్టర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేష మొదటి సినిమాను రాబోతుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే సరికొత్త తరహా ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రేసు గుర్రం, లక్ష్మీ, లక్ష్యం’ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.

‘అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, ఆదిత్య వర్మ, ఫేమ్ రదన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

Tags :

Advertisement