Advertisement

  • వెయిట్ లిఫ్టర్ గా మారనున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్

వెయిట్ లిఫ్టర్ గా మారనున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్

By: chandrasekar Wed, 05 Aug 2020 10:00 AM

వెయిట్ లిఫ్టర్ గా మారనున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్


ర‌కుల్ ప్రీత్ సింగ్ సినిమాల‌తో పాటు వ్యాపారరంగంలో కూడా బిజీగా మారిపోయింది. ప్ర‌స్తుతం ర‌కుల్ త‌న సోదరుడితో క‌లిసి హైద‌రాబాద్ లో ఉంటోన్న విషయం తెలిసిందే. ర‌కుల్ సినిమాల విష‌యానికొస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-క్రిష్ కాంబినేష‌న్ లో రానున్న విరూపాక్ష చిత్రంలో నటించనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ర‌కుల్ కొత్త సినిమాకు సంబంధించిన మ‌రో వార్త కూడా ఫిలింనగ‌ర్ లో వినిపిస్తోంది. నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌స్తుతం ఒలింపిక్ విజేత, వెయిట్ లిఫ్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ కోసం హీరోయిన్ ను వెతికే ప‌నిలో ప‌డ్డారు కోన వెంక‌ట్‌. మొదట్లో ఈ పాత్ర కోసం తాప్సీని సంప్ర‌దించ‌గా వేరే సినిమాల కార‌ణంగా తాప్సీ నో చెప్పింద‌ట‌.

ఫిట్ నెస్ నైపుణ్యాలు క‌లిగిన న‌టి అయితే ఈ రోల్ కు బాగా సెట్ అవుతుంద‌ని భావించిన కోన వెంక‌ట్ ర‌‌కుల్ ప్రీత్ ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ర‌కుల్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్.

Tags :
|

Advertisement