Advertisement

  • డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హాస్య నటి భారతి సింగ్ కు బెయిల్ మంజూరు

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హాస్య నటి భారతి సింగ్ కు బెయిల్ మంజూరు

By: Sankar Mon, 23 Nov 2020 11:28 PM

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హాస్య నటి భారతి సింగ్ కు బెయిల్ మంజూరు


బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్‌ దుమారం హిందీ చిత్రసీమలో కల్లోలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన హాస్యనటి భారతీ సింగ్‌, తమె భర్త హర్ష లింబాచియాలకు బెయిల్‌ లభించింది.

ముంబై కోర్టు సోమవారం వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శనివారం వీరి ఇంటి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, భారతీ సింగ్‌తో పాటు లింబాచియాను శనివారం అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.

కాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో మత్తుమందులు వాడుతున్నవారికి భయం మొదలైంది. స్టార్‌ హీరోయిన్ల దగ్గర నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు వరకు ఈ వరుసలో ఉన్నారు. ఇటీవల నటుడు ఆర్జున్‌ రాంపాల్‌కు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు.

Tags :

Advertisement