Advertisement

బండ్ల గ‌ణేష్ ఆరోగ్యం కుదుట పడుతోంది

By: chandrasekar Wed, 24 June 2020 5:22 PM

బండ్ల గ‌ణేష్ ఆరోగ్యం కుదుట పడుతోంది


కమెడియన్‌గా సినిమాల్లోకి వచ్చిన ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి మంచి సినిమాలు నిర్మించాడు. ఆ మ‌ధ్య రాజ‌కీయాల‌లోకి వెళ్ళిన ఆయ‌న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే బండ్ల గణేష్ ఇటీవ‌ల‌ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట.

దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. బండ్ల గ‌ణేష్‌కి క‌రోనా అని తెలియ‌డంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందారు.

ఫ్యాన్స్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తూ ట్వీట్స్ చేశారు. ఈ సంద‌ర్భంలో బండ్ల గ‌ణేష్ తాను ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని, త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

అత‌ని ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా కరోనా టెస్ట్ చేయ‌గా, రిపోర్ట్స్‌లో నెగెటివ్ అని తేలింద‌ని చెప్పుకొచ్చాడు. గ‌ణేష్ త్వ‌ర‌లో స్టార్ హీరోతో ఓ సినిమాని నిర్మించ‌నున్నట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో దీనిపై క్లారిటీ రానుంది.

Tags :
|

Advertisement