Advertisement

  • వీరాభిమాని నిర్మాణంలో మరొక సినిమాకు పచ్చజెండా ఊపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

వీరాభిమాని నిర్మాణంలో మరొక సినిమాకు పచ్చజెండా ఊపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

By: Sankar Mon, 28 Sept 2020 3:32 PM

వీరాభిమాని నిర్మాణంలో మరొక సినిమాకు పచ్చజెండా ఊపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్


తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు..ఇక పవర్ స్టార్ కు బయట ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు..అందులో ముఖ్యుడు బండ్ల గణేష్ ..ఇప్పటికే పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన బండ్ల , మరొక సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు..

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బండ్ల కు ఓకే చెప్పేసినట్టు కనిపిస్తోంది. దీంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన కల నెర వేరబోతోందంటూ కొత్త ప్రాజెక్టును పవన్ వీరాభిమాని ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం బండ్ల గణేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాస్ ఓకే చెప్పారు. మరోసారి కల నెరవేరుతోంది. ఇందుకు దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

నా భవిష్యత్తును ఈరోజు 11.23 గంటలకు ప్రకటిస్తాను. నా శ్రేయోభిలాషులకు ఇదొక అద్భుతమైన వార్త’’ అని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో తీసుకున్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేయడం విశేషం. దీంతో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ లాంటి మరో బ్లాక్ బస్టర్ సిద్ధం కానుందంటూ పండుగ చేసుకుంటున్న అభిమానులు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనిపై అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది.

Tags :

Advertisement