Advertisement

  • బర్త్ డే సందర్భంగా పాట పాడి అలరించిన బాలయ్య బాబు

బర్త్ డే సందర్భంగా పాట పాడి అలరించిన బాలయ్య బాబు

By: Sankar Tue, 09 June 2020 8:56 PM

బర్త్ డే సందర్భంగా పాట పాడి అలరించిన బాలయ్య బాబు

అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పండుగ రోజే. ఆ రోజు తమ అభిమాన నటుడి సినిమా గురించి ఏదో ఒక అప్‌డేట్ వస్తుందని అభిమానులు అంతా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు హీరోలు కూడా తమ పుట్టినరోజున ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు.

అయితే ఈసారి నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ అందునా కళ్లు చెదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అయ్యారు. తన 60వ జన్మదినం సందర్భంగా ఒక అపురూపమైన పాటతో ప్రేక్షకాభిమానులను అలరించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. తన తండ్రి నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘శివశంకరీ శివానందలహరి’ పాటను బాలయ్య స్వయంగా పాడారు.


బర్త్‌డేకి ఒక రోజు ముందే అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య ఈ పాటను విడుదల చేశారు. ఎన్‌బికె ఫిల్మ్స్ యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ పాట విడుదలైంది. ఇక బాలయ్య గానం విషయానికి వస్తే.. చాలా కష్టమైన ఈ పాటకు బాలయ్య మ్యాగ్జిమమ్ ఎఫర్ట్ పెట్టారు. నిజంగా ఇది అభిమానులకు మాంచి ట్రీట్ అని చెప్పవచ్చు. ‘ఇంకా చాలా ఉన్నాయ్ లోపల.. దాచాం అంతే.. సరదాగా ఒకటి వదిలాం అంతే..’ అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పిన విషయం తెలిసిందే. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్నో బాలయ్య నుంచి వినవచ్చు అనేలా ఆయన గానం సాగింది. ఈ పాటతో నిజంగానే అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

Tags :
|

Advertisement