Advertisement

  • నందమూరి సింహం టీజర్... నందమూరి అభిమానులకు పూర్తి విందు

నందమూరి సింహం టీజర్... నందమూరి అభిమానులకు పూర్తి విందు

By: Sankar Tue, 09 June 2020 8:40 PM

నందమూరి సింహం టీజర్... నందమూరి అభిమానులకు పూర్తి విందు

బోయపాటి శ్రీను , నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి ..వారి ఇద్దరి కలయికలో వచ్చిన సింహ , లెజెండ్ ఎంతటి ఘన విజయాలు సాధించాయి అందరికి తెలిసిందే..ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా టీజర్ బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేసారు..ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

64 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో నందమూరి అభిమానులకు కావాల్సిన పూర్తి విందు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెల్లటి దుస్తులు, గుబురు మీసాలతో మాస్ లుక్‌లో బాలయ్య కనిపించారు. ఆయన చెప్పిన ఫవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు, శత్రుగణాన్ని గాల్లోకి ఎగిరేసి కొట్టడం వంటి సీన్లు టీజర్‌లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమా కోసం బాలయ్య భారీగానే బరువు తగ్గినట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.


Tags :
|

Advertisement