Advertisement

  • బోయపాటి, బాలయ్య క్రేజీకాంబినేషన్ సినిమాపేరు అదేనా?

బోయపాటి, బాలయ్య క్రేజీకాంబినేషన్ సినిమాపేరు అదేనా?

By: Dimple Tue, 01 Sept 2020 01:33 AM

బోయపాటి, బాలయ్య క్రేజీకాంబినేషన్ సినిమాపేరు అదేనా?

‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత నందమూరి నటసింహం బాలయ్య, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ కాస్త చక్కబడగానే.. మళ్లీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఏమిటనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని ‘బీబీ3’ అని పిలుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక టైటిల్ విషయానికి వస్తే.. అప్పుడెప్పుడో కృష్ణవంశీ చేసిన చిత్రం ‘డేంజర్’. ఈ టైటిల్‌నే ‘బీబీ3’ చిత్రానికి పెడుతున్నారని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. అంతకు ముందు కూడా కొన్ని టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడీ చిత్రానికి టైటిల్ ఇదేనంటూ కొత్త టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ టైటిల్ ఏమిటని అనుకుంటున్నారా? ‘టార్చ్‌బేరర్’. ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదా..! ఎక్కడో కాదు అబ్బాయి తారక్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇది. ఎన్టీఆర్ గురించి వివరిస్తూ.. ఆ సినిమాలో రావు రమేష్ చెబుతాడు. అప్పటి ఈ మాటే ఇప్పుడు బాలయ్య చిత్ర టైటిల్ కాబోతోందా? ఏమో.. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో.. చూద్దాం.

Tags :

Advertisement