Advertisement

  • డర్టీ హరి సినిమా పోస్టర్లు తగలబెట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు

డర్టీ హరి సినిమా పోస్టర్లు తగలబెట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు

By: Sankar Fri, 25 Dec 2020 3:59 PM

డర్టీ హరి సినిమా పోస్టర్లు తగలబెట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు


డర్టీ హారీ’ సినిమా పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయని, ఆ సినిమాను నిషేదించాలంటూ ఈ రోజు కూకట్‌పల్లి బస్ స్టాప్ వద్ద మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన ఆ సినిమా పోస్టర్లను భజరంగ్ దళ్ కార్యకర్తలు చింపివేసారు.

అనంతరం ఆ పోస్టర్లను తగులపెట్టారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ నాయకుడు జీవన్ మాట్లాడుతూ భారత దేశం సాంస్కృతి సాంప్రదాయాలు హాని కలిగించే డర్టీ హరి లాంటి సినిమాలకు తాము వ్యతిరేకమని అన్నారు. అటువంటి సినిమాలను నిషేదించాలని డిమాండ్ చేసారు.

ఎటువంటి సెన్సార్ లేకుండా సినిమాలు విడుదల చేస్తుంటే సెన్సార్ బోర్డు ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఇటువంటి సినిమాలు ఎక్కడ విడుదల అయిన అడ్డుకుంటామని అన్నారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు.

Tags :
|

Advertisement