Advertisement

  • తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన బాహుబలి మొదలై నేటికీ ఏడేళ్లు ..

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన బాహుబలి మొదలై నేటికీ ఏడేళ్లు ..

By: Sankar Mon, 06 July 2020 4:19 PM

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన బాహుబలి మొదలై నేటికీ ఏడేళ్లు ..



తెలుగు సినిమాను బాహుబలికి ముందు , బాహుబలి తర్వాత అని విభజించవచ్చు ..అప్పటి వరకు ఇండియాలో పెద్ద సినిమా అంటే కేవలం బాలీవుడ్ వాళ్ళు తీసే వాటినే అనే వాళ్ళు , ఎందుకంటే దేశంలో అత్యధిక కలెక్షన్స్ వచ్చేది బాలీవుడ్ సినిమాలకే కాబట్టి, కానీ తెలుగు సినిమా దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తీసిన తర్వాత ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ వచ్చేలా ప్రాంతీయ బాషల వాళ్ళు కూడా తీయగలరు అని నిరూపితం అయింది ..

కేవలం ఇండియాలోనే గాక ప్రపంచం మొత్తంలో బాహుబలి ప్రభంజనం కొనసాగింది ..బాహుబలి మొదటి పార్ట్ చివర్లో కట్టప్ప బాహుబలిని చంపే సీన్ తో ముగించడంతో , రెండు పార్ట్ వచ్చేదాకా దేశం మొత్తం ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ..అంతలా ఆ సినిమా ప్రభావం చూయించింది ..ఇక రెండో పార్ట్ , మొదటి పార్ట్ ను మించి సంచలన విజయం సాధించి దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది ..

ఇక ఇంతటి అద్భుత సినిమా మొదలై నేటికి (జూలై 6) 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ విషయం తెలుపుతూ బాహుబలి మొదలైన రోజు నాటి ఫొటోలను ‘బాహుబలి’ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘6 జూలై, 2013 బాహుబలి చిత్రం ప్రారంభమైన క్షణం. 7 సంవత్సరాల క్రితం ఇదే రోజు మేము బాహుబలి చిత్ర షూటింగ్‌ని మొదలెట్టాము..’’ అని బాహుబలి టీమ్ ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో అభిమానులు ఈ చిత్రం యొక్క ఫొటోలను షేర్ చేస్తూ.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags :
|
|
|

Advertisement