Advertisement

  • రష్యా లో కూడా కొనసాగుతున్న బాహుబలి మానియా

రష్యా లో కూడా కొనసాగుతున్న బాహుబలి మానియా

By: Sankar Thu, 28 May 2020 5:19 PM

రష్యా లో కూడా కొనసాగుతున్న బాహుబలి మానియా

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పినబాహుబలి గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండియన్‌ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా రష్యాలోనూ ఇరగదీస్తోంది. అయితే థియోటర్లో అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా అక్కడి టీవీ చానెల్‌లో ప్లే అవుతుంది. రష్యన్‌ వాయిస్‌ఓవర్‌తో డబ్బింగ్‌ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో దుమ్ముదులుపుతుంది.
తాజాగా సినిమాలోని ఒక​సన్నివేశాన్ని రష్యన్‌ వాయిస్‌ ఓవర్‌తో ఉన్న డైలాగ్‌తో రష్యన్‌ ఎంబసీ తమ ట్విటర్లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ' ఒక ఇండియన్‌ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బాహుబలి 2 సినిమా రష్యన్‌ వాయిస్‌ ఓవర్‌లో టీవీల్లో ప్లే అవుతుంది' అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ నెటిజన్లు ఒక భారతీయ సినిమాను రష్యాలో విడుదల చేయడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. బాహుబలి తర్వాత కేజీఎఫ్‌ సినిమాను కూడా రష్యన్‌ వాయిస్‌ఓవర్‌తో విడుదల చేయాలంటూ కోరుతున్నారు.

Tags :
|

Advertisement