Advertisement

"అవతార్ 2" విడుదల తేదీ వాయిదా

By: chandrasekar Sat, 25 July 2020 08:50 AM

"అవతార్ 2" విడుదల తేదీ వాయిదా


కరోనావైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. అందులో సినిమా రంగంపై కూడా పడింది. ఎన్నో నెలల నుంచి థియేటర్లే తెరుచుకోలేదు. కరోనా వైరస్ సంక్రమణ ప్రమాదం వల్ల షూటింగ్‌ కూడా మొదలు కావడం లేదు.

తాజాగా కరోనా వైరస్ ప్రభావం జేమ్స్ కేమరూన్ తెరకెక్కిస్తోన్న అవతార్ 2 పై కూడా పడింది. అంతకు ముందు ఈ సినిమాను 2020 డిసెంబర్‌లో విడుదల చేద్దాం అని అనుకున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో ఈ మూవీని ఒక సంవత్సరం వాయిదా వేశారు.

అవతార్ 2 విడుదల తేదీని వాయిదా వేస్తున్న విషయాన్ని జేమ్స్ కేమరూన్ ఒక లేఖను విడుదల చేసి ప్రకటించారు. ఈ మూవీని 2022లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అవతార్ మూవీలో రియాలిటీ కంటే వర్చువల్ వర్స్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రసుత్తం ఈ వర్క్ చేసే కంపెనీల్లో ఏ పనీ జరగడం లేదు. దీంతో అవతార్ 2ను వాయిదా వేయాల్సి వచ్చింది అని తెలిపాడు జేమ్స్ కేమరూన్.

Tags :
|

Advertisement