Advertisement

  • అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమా "నూటొక్క జిల్లాల అందగాడితో "

అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమా "నూటొక్క జిల్లాల అందగాడితో "

By: Sankar Wed, 09 Sept 2020 12:46 PM

అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమా "నూటొక్క జిల్లాల అందగాడితో "


తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న మంచి నటులలో అవసరాల శ్రీనివాస్ ఒకరు..కేవలం నటుడిగానే గాక దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుకున్నాడు..అయితే ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ త్వరలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు "నూటొక్క జిల్లాల అందగాడితో" అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో చిలసౌ ఫేం రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా 'హిట్' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. "నూటొక్క జిల్లాల అందగాడితో" సినిమాకు రుహని అందాలు ప్లస్ అవుతాయని అంటున్నారు చిత్రయూనిట్. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు- క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

కరోనా నిబంధనలను అనుసరిస్తూ .. షూటింగ్ ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నదని సమాచారం . అవసరాల శ్రీనివాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అష్టాచమ్మా, ఊహలు గుసగుసలాడే, అమితుమీ సినిమాలో కామెడీతో ఆకట్టుకున్నాడు అవసరాల. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి .

Tags :
|
|

Advertisement