Advertisement

  • వర్మ పైన చట్టపరమైన చర్యలు తప్పవు ..ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ

వర్మ పైన చట్టపరమైన చర్యలు తప్పవు ..ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ

By: Sankar Tue, 28 July 2020 8:11 PM

వర్మ పైన చట్టపరమైన చర్యలు తప్పవు ..ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ



అమృత, మారుతీరావులపై మర్డర్ సినిమా తీయటం రామ్‌గోపాల్‌వర్మ శాడిజానికి ప్రతీక అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు.. వారి సామాజిక వర్గాన్ని బజారున పడేయటం హేయమైన చర్య. మర్డర్ సినిమాపై మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..

మారుతీరావు సాధుజీవి, అటువంటి వ్యక్తిని మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరం. అమృత, మారుతీరావులను.. ఒకరు ప్రేమించి తప్పు చేయటం, మరొకరు హత్య చేయించడం ద్వారా ఇద్దరినీ విలన్లుగా సృష్టించటం వర్మ పబ్లిసిటీకి పరాకాష్ట. మర్డర్ సినిమా ద్వారా రెండు కుటుంబాలను వర్మ బజారున పడేస్తున్నారు. వర్మ మా డిమాండ్‌కు తలొగ్గకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు' అంటూ రామకృష్ణ హెచ్చరించారు..

కాగా వివాదాలతో ఎప్పుడు సావాసం చేసే వర్మ కు ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు ..ఇటీవలే పవర్ స్టార్ సినిమా మీద ఎన్ని విమర్శలు , బెదిరింపులు వచ్చిన వర్మ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు ..మరి ఈ సినిమా విషయంలో ఏం చేస్తాడో చూడలి

Tags :
|

Advertisement