Advertisement

  • బాలీవుడ్ స్టార్ హీరోతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ..?

బాలీవుడ్ స్టార్ హీరోతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ..?

By: Sankar Sun, 28 June 2020 10:33 AM

బాలీవుడ్ స్టార్ హీరోతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ..?



సందీప్ వంగ తెలుగులో తీసిందే ఒకే ఒక్క సినిమా అయినప్పటికి ఆ సినిమాతో సందీప్ సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు ..అర్జున్ రెడ్డి అంటూ విజయ్ దేవరకొండను హీరో గా పెట్టి సినిమా తీసిన సందీప్ అంతకుముందు వరకు తెలుగు సినిమాలో ఎవ్వరు చేయలేని విధంగా ఆ సినిమాను తీసి బంపర్ హిట్ కొట్టాడు ..ఆ ఒక్క సినిమాతోనే విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు ..ఆ సినిమా తర్వాత గీత గోవిందం వంటి ఇండస్ట్రీ హిట్ లో విజయ్ నటించి తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు ..

అయితే సందీప్ మాత్రం ఆ సినిమా తర్వాత ఇంతవరకు ఇంకో తెలుగు సినిమా తీయలేదు ..హిందీలో ఇదే అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ తర్వాత ఎవరితో తీస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ..కబీర్ సింగ్ సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. మహేష్, రణ్‌వీర్ వంటి హీరోలకు సందీప్ కథలు చెప్పాడని, వారు అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.

తాజాగా సందీప్ తర్వాతి సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. సందీప్ దర్శకత్వంలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ అంగీకరించినట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కంటే ముందే రణ్‌బీర్‌తో సందీప్ చర్చలు జరిపినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రాబోతోందట.

Tags :
|

Advertisement