Advertisement

  • ‘దిల్ బేచారా’ టైటిల్ సాంగ్ ను ఆలపించిన ఎ.ఆర్.రెహమాన్

‘దిల్ బేచారా’ టైటిల్ సాంగ్ ను ఆలపించిన ఎ.ఆర్.రెహమాన్

By: chandrasekar Sat, 11 July 2020 10:57 AM

‘దిల్ బేచారా’ టైటిల్ సాంగ్ ను ఆలపించిన ఎ.ఆర్.రెహమాన్


‘దిల్‌ బేచారా’ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం. ఈ సినిమాను ఈనెల 24న హాట్‌స్టార్ ద్వారా విడుదల చేస్తున్నారు. నాన్ సబ్‌స్ర్కైబ్డ్ యూజర్స్ కూడా ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ సుశాంత్ అభిమానులతో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఒక్కరోజులో 5 మిలియన్ లైక్స్‌తో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌’ చిత్ర ట్రైలర్‌ లైక్స్ రికార్డును ఈ సినిమా అధిగమించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘దిల్ బేచారా’ అంటూ సాగే ఈ పాటను ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఫరా ఖాన్ కొరియోగ్రఫీ వహించారు. ప్రస్తుతం ఈపాట శ్రోతలను ఊపేస్తోంది.

విడుదలైన 5 గంటల్లోనే యూట్యూబ్‌లో 7 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు, 2.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట పాత రెహమాన్‌ను గుర్తుచేస్తోంది. ఆయన మ్యాజిక్ కనిపించింది. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మంచి నటుడు అర్ధాంతరంగా తనువుచాలించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సుశాంత్‌ ఆత్యహత్యపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Tags :

Advertisement