Advertisement

  • అనుష్క బిగ్ బాస్ 4 కు ఎందుకు రాలేదో చెప్పేసిందిగా..!

అనుష్క బిగ్ బాస్ 4 కు ఎందుకు రాలేదో చెప్పేసిందిగా..!

By: Anji Wed, 30 Sept 2020 10:14 AM

అనుష్క బిగ్ బాస్ 4 కు ఎందుకు రాలేదో చెప్పేసిందిగా..!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సంగతి ప్రస్తుతం మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గో వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ షో కు గెస్ట్ గా అనుష్క్ రాబోతుందని గట్టిగా ప్రచారం జరగడం తో శని , ఆదివారాల్లో ప్రేక్షకులంతా టీవీలకే అత్తుకుపోయారు. కానీ అనుష్క రాకపోయేసరికి బాగా నిరాశకు లోనయ్యారు.


తాజాగా అనుష్క తాను రాకపోవడానికి క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని… మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుష్క తెలిపింది. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే అక్కడ ఎక్కువ మందిని కలవాల్సి ఉంటుంది. అందుకే బయటకు వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకుంది.


తన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే, ఆన్ లైన్ లోనే తాను ప్రమోషన్ చేస్తానని ఆమె కండిషన్ పెట్టిందట. ఆలా హౌస్ లోకి అనుష్క రాలేకపోయింది.

Tags :

Advertisement