Advertisement

పెళ్లిపై స్పందించిన అనుష్క

By: chandrasekar Wed, 04 Nov 2020 1:02 PM

పెళ్లిపై స్పందించిన అనుష్క


చాలా రోజుల నుండి అనుష్క పెళ్లిపై అనేక రూమర్లు వస్తూనే వుంది. స్వీట్ బ్యూటీ అనుష్క‌ ఈ పేరు ఇప్పుడు అంద‌రికి సుప‌రిచిత‌మే. సూప‌ర్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన అనుష్క ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరింది. దేశ విదేశాల‌లోను అభిమానుల‌ని సంపాదించుకుంది. బాహుబ‌లి సినిమాలో దేవ‌సేన‌గా న‌టించిన అనుష్క‌ను జ‌పాన్, రష్యా దేశాల‌కు చెందిన సినీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానిస్తారు. అనుష్క ఇటీవ‌ల నిశ్శ‌బ్ధం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేశారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 38 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న అనుష్క ప్ర‌స్తుతం తన పూర్తి కాన్స‌న్‌ట్రేష‌న్ సినిమాల‌పైనే పెట్టింది.

ఈ అమ్మడిని పదే పదే పెళ్లిపై అందరూ ప్రశ్నించడంతో ఆమె స్పందించింది. పెళ్ళి చేసుకోవాల‌నే ఆలోచ‌నే చేయ‌డం లేదు అని చెప్పింది. రీసెంట్ గా ఈ అమ్మ‌డికి పెళ్ళి గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స‌మాధానం ఇచ్చిన స్వీటి వివాహ వ్య‌వ‌స్థ‌పై నాకు చాలా న‌మ్మ‌క ముంది. న‌చ్చిన వాడు దొరికిన‌ప్పుడు పెళ్ళి చేసుకుంటాను. పిల్ల‌లు కూడా కావాల‌నుకుంటున్నాను. అయితే ఇప్పుడు పిల్ల‌ల విష‌యంలో అంత తొంద‌రేమి లేదు. 20 ఏళ్ళ వ‌య‌స్సు నుండే నాకు త‌ల్లిదండ్రుల నుండి పెళ్లి విష‌యంలో ఒత్తిడి మొద‌లైంది. ఇప్పుడు వారి ఆలోచ‌నా ధోర‌ణి మారింది. పెళ్ళి చేసుకునే వ‌రకు నా ఫోక‌స్ అంతా సినిమాపైనే అంటూ బ‌దులిచ్చింది జేజెమ్మ‌. మరి ఈ అందాల భామకు పెళ్లెప్పుడవుతుందో వేచి చూడాల్సిందే.

Tags :
|

Advertisement