Advertisement

  • పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అనుష్క ... పెళ్లి ఎప్పుడంటే...!

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అనుష్క ... పెళ్లి ఎప్పుడంటే...!

By: Anji Wed, 30 Sept 2020 09:41 AM

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అనుష్క ... పెళ్లి ఎప్పుడంటే...!

కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది చేసుకోవాల్సిన పెళ్లిని అనుష్క వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసుకుందట. బహుశా ఆమె చివరి సినిమా నిశ్శబ్దం కావొచ్చు. ఇలా అనుష్కపై ఓ రేంజ్ లో మరోసారి పుకార్లు చెలరేగుతున్నాయి.

వీటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది అనుష్క. తను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని పరోక్షంగా వెల్లడించింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలా సినిమాలు చూశాను. చాలా స్క్రిప్టులు కూడా చదివాను. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంతేకాదు.. వాటిలోంచి రెండు ప్రాజెక్టులకు సైన్ చేశాను కూడా.

వాటి షూటింగ్స్ లో జాయిన్ అవ్వడానికి చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాను. ఇలా తన లైనప్ బయటపెట్టింది అనుష్క. అంతేకాదు.. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ 2 సినిమాలతో బిజీ అవ్వబోతున్నానని, మరే ఇతర ప్లాన్స్ లేవని పరోక్షంగా తన పెళ్లి టాపిక్ ను కొట్టేసింది బొమ్మాలి.

ఈ లాక్ డౌన్ టైమ్ తనకు వరంలా కలిసొచ్చిందని చెప్పుకొచ్చింది అనుష్క. ఇన్నాళ్లూ సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఓ రకమైన ఒత్తిడిలో బతికానని, లాక్ డౌన్ టైమ్ లో మాత్రం తన మనసుకు నచ్చినట్టు, ఎలాంటి రూల్స్ పెట్టుకోకుండా బతికానని, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది అనుష్క.

Tags :

Advertisement