Advertisement

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో

By: chandrasekar Tue, 18 Aug 2020 09:04 AM

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో


నందమూరి ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో రాబోతున్నారనేది ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, నార్నె శ్రీనివాసరావు కుమారుడు తెలుగు సినిమా పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని అంటున్నారు. టాలీవుడ్ లో ఆయన రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్స్ ప్రారంభమయ్యాయని సినీ పరిశ్రమలోని చాలా మంది అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిని ఎవరు పరిచయం చేస్తారనే విషయ౦ కోసం వేచి చూడాల్సిందే. అయితే, తన బావమరిది సినీ రంగ ప్రవేశంలో ఎన్టీఆర్ ప్రమేయం ఉందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్టీఆర్, నార్నె శ్రీనివాసరావు మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఇదిలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీతో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తోన్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లు. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్.

Tags :
|
|

Advertisement