Advertisement

  • బిగ్ బాస్‌లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ... ఎవరో తెలుసా..?

బిగ్ బాస్‌లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ... ఎవరో తెలుసా..?

By: Anji Sat, 24 Oct 2020 8:48 PM

బిగ్ బాస్‌లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ... ఎవరో తెలుసా..?

బుల్లితెర ప్రేక్షకుల్లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో ఈ షో మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు 100 శాతం ఎఫర్ట్స్‌తో పెర్ఫార్మన్స్ ఇస్తుండటంతో ప్రేక్షకుల నుంచి అద్భుత రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు మరో వైల్ కార్డు ఎంట్రీని హౌస్‌లోకి పంపించాలని యోచిస్తున్నారట. గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో.. ఆమె స్థానంలో ఈ కొత్త కంటెస్టెంట్‌ను పంపించబోతున్నారని సమాచారం.

యాంకర్, గాయని ‘మంగ్లీ’ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్.. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

ఈ వారం ఎలిమినేషన్స్‌లో నోయల్, అరియానా గ్లోరి, మోనాల్, అభిజిత్, దివి, అవినాష్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అరియనా, మోనాల్ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఈ వారం ఎవరు హౌస్‌ నుంచి బయటికి వెళ్తారో చూడాలి.

Tags :

Advertisement