Advertisement

  • వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో స్టార్ డైరెక్టర్ ..?

వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో స్టార్ డైరెక్టర్ ..?

By: Sankar Fri, 26 June 2020 11:16 AM

వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో స్టార్ డైరెక్టర్ ..?



అనిల్ రావిపూడి ఒక అయిదు సంవత్సరాల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎవ్వరికి తెలీదు కానీ కేవలం ఈ అయిదు ఏళ్లలోనే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచి , ఈ సంవత్సరం మహేష్ బాబుకు సరిలేరు నీకెవ్వరూ వంటి ఇండస్ర్టీ హిట్ ఇచ్చాడు ..అంతకుమున్దు ఏడాది కూడా వెంకటేష్ ,వరుణ్ తేజ్ లకు f2 రూపంలో బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చాడు ..తీసిన అన్ని సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి ఘన విజయాలు సాధిస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి దీనితో ఈ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో సినిమా తీస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు ..అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు ఒక వెబ్ సిరీస్ తీసే ప్లాన్ లో ఉన్నాడట ..

కరోనా కారణంగా దేశంమొత్తం లాక్ డౌన్ విధించడంతో సినిమాలు అన్ని ఎక్కడిక్కడ ఆగిపోయాయి , ఒకవేళ సినిమాలు కంప్లీట్ అయినా రిలీజ్ చేయడానికి థియేటర్లు లేవు , అవి ఎప్పటికి ఓపెన్ అవుతాయి అన్నది ఎవరికీ తెలీదు ..దీనితో అందరూ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు ఒకానొక సందర్భంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా నెక్స్ట్ అంత వెబ్ సిరీస్ ల కాలమే అనిఅన్నాడు ..

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర‌వింద్ ప్రారంభించిన తెలుగు డిజిట‌ల్ యాప్ ఆహా కోసం అనీల్ రావిపూడి ఓ కామెడీ వెబ్ సిరీస్‌ను విడుద‌ల సిద్ధం చేయ‌బోతున్నాడ‌ట‌. కొత్త న‌టీన‌టులు, సినిమాలోని క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌తో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కే అవ‌కాశం ఉంద‌ని టాక్‌..ఈయన సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .. మ‌రో ప‌క్క అనీల్ ‘ఎఫ్‌3’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి స్పీడు పెంచుతాడు

Tags :
|
|

Advertisement