Advertisement

  • F2కు సిక్వెల్‌గా F3ని తీయాలనీ అనిల్ రావిపూడి నిర్ణయం

F2కు సిక్వెల్‌గా F3ని తీయాలనీ అనిల్ రావిపూడి నిర్ణయం

By: chandrasekar Thu, 09 July 2020 3:43 PM

F2కు సిక్వెల్‌గా F3ని తీయాలనీ అనిల్ రావిపూడి నిర్ణయం


అనిల్ రావిపూడి వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దర్శకుడు. ఆయన ఇటీవల మహేష్ హీరోగా సరిలేరు నీకెవ్వరుకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా F2.

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు F2కు సిక్వెల్‌గా F3ని తీయాలనీ భావించారు. దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తింది.

ఇక మంచి రోజు చూసుకుని సినిమాను ప్రకటిద్దాం అనుకున్న తరుణంలో కరోనా వచ్చి అన్ని ప్లాన్స్‌ను మార్చి వేసింది. దీంతో ప్రస్తుతానికి ఆ పెద్ద సినిమా సంబందించిన వర్క్‌ను పక్కకు పెట్టి అనిల్ ప్రస్తుతం ఓ చిన్న సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట.

కరోనా హైదరాబాద్‌లో విజృంభిస్తుండంతో కొన్నాళ్లుగా అనిల్ రావిపూడి తన రైటింగ్ టీం తో కలిసి సొంత ఊరిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగానే ఆ చిత్రంలో నటించే నటీనటులు, ఇతర టెక్నికల్ సిబ్బంది వివరాలు వెల్లడించనుంది చిత్రబృందం.

Tags :

Advertisement