Advertisement

  • ప‌వ‌ర్ స్టార్ కి విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో...!

ప‌వ‌ర్ స్టార్ కి విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో...!

By: Anji Mon, 21 Dec 2020 2:12 PM

ప‌వ‌ర్ స్టార్ కి విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో...!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ క్రిష్ ఓ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వెట‌ర‌న్ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. రత్నం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మొఘ‌లాయిల కాలం నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో రూపొందుతోంది.

ఇందులో ప‌వ‌న్.. రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో 27వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అనిల్ క‌పూర్ న‌టించ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ మేర‌కు అనిల్ తో క్రిష్ సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ని.. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో అనిల్ కూడా సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌ని వినికిడి. త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 27లో అనిల్ క‌పూర్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, విరూపాక్ష అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాకి స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు. 2021 ద్వితీయార్ధంలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Tags :

Advertisement