Advertisement

పవన్ కళ్యాణ్ తో యాంకర్ శ్రీముఖి...!

By: Anji Thu, 05 Nov 2020 06:00 AM

పవన్ కళ్యాణ్ తో యాంకర్ శ్రీముఖి...!

బుల్లితెర రాములమ్మ అంటే ఎవరైనా టక్కున యాంకర్ శ్రీముఖి పేరు చెపుతారు. అంతలా ఆమె పాపులర్. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడం తో అంత షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం చేస్తున్నాడు.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ రీసెంట్గా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్ట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా శ్రీముఖి వకీల్ సాబ్ గెటప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌తో ఓ సెల్పీ దిగింది.

ఆ ఫోటోలను వెంటనే శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా శ్రీముఖి ఈ సమయంలో రాయడానికి మాటలు రావడం లేదంటూ.. ‘లవ్ పవన్ కళ్యాణ్’ అని ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్‌లో ఉన్నారు. మరో వైపు ఈ పోస్ట్ చేస్తుంటే.. ఈ సినిమాలో శ్రీముఖి ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా అని అంత మాట్లాడుకుంటున్నారు.

Tags :

Advertisement