Advertisement

  • Flash News: యాంకర్ ప్రదీప్ పెళ్లి బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో...?

Flash News: యాంకర్ ప్రదీప్ పెళ్లి బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో...?

By: Anji Tue, 29 Sept 2020 10:05 AM

Flash News: యాంకర్ ప్రదీప్ పెళ్లి బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో...?

వరుసపెట్టి వెండితెర, బుల్లితెర స్టార్స్ పెళ్లి పీటలెక్కడం ఓ కిక్కిచ్చింది. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా పెళ్లి చేసుకోగా.. తాజాగా యంగ్ యాంకర్స్ రష్మీ గౌతమ్, శ్రీముఖి మూడుముళ్ళ బంధానికి రెడీ అయ్యారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతలో మరో ఎనర్జిటిక్ న్యూస్ అభిమానులకు కిక్ ఇస్తుంది. అనేంటో చుడండి మరి....

యాంకర్ ప్రదీప్ పెళ్లి మ్యాటర్ కూడా బయటకురావడంతో సినీ సర్కిల్స్ మొత్తంలో వీళ్ళ పెళ్లి గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. యాంకర్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించాడు ప్రదీప్ మాచిరాజు. బుల్లితెరపై వినోదాల విందిస్తూ పలు షోస్ ద్వారా ఆకట్టుకుంటున్నాడు. ఎంతోమంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నాడు.

అయితే మనోడికి ఇప్పటికే 33 ఏళ్ళు మీదపడటంతో అంతా ఆయన పెళ్లి మ్యాటర్ పైనే ఫోకస్ పెట్టారు. పలు ఇంటర్వ్యూల్లో అతనికి పెళ్లిపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుండేవి. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లవ్ సీక్రెట్స్ కూడా చెప్పిన ప్రదీప్.. ఆమెకు ఇప్పటికే పెళ్ళై పోయిందని అన్నాడు. దీంతో అప్పటి నుంచి ప్రదీప్ పెళ్లి మ్యాటర్ వైరల్ అవుతూ వస్తోంది.

అయితే ఇప్పుడు మాత్రం మనోడు నిజంగానే పెళ్లికి సిద్ధమయ్యాడని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పెళ్లికి మనకు చాలా దూరం అని సరదా కామెంట్స్ చేస్తూ బుల్లితెర హంగామా చేసే ప్రదీప్ మరో రెండు మూడు నెలల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.

ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని, కాకపోతే దాన్ని సీక్రెట్ గానే ఉంచారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉందని టాక్. చూడాలి దీనిపై ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతాడనేది వేసి చూడాల్సిందే.

Tags :

Advertisement