Advertisement

యాంకర్ అవ్వాలని అనుకోలేదు ..అనసూయ

By: Sankar Thu, 25 June 2020 5:33 PM

యాంకర్ అవ్వాలని అనుకోలేదు ..అనసూయ



తెలుగులో ప్రస్తుతం ఉన్న ఫేమస్ యాంకర్లలో ముందు వరుసలో ఉంటారు అనసూయ ..కేవలం యాంకర్ గానే గాక సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ..అందం , అభినయం రెండు కలగలిపిన అతి కొద్దీ మదిలో అనసూయ ఒకరు మోడరన్ డ్రెస్సులు వేసిన , పద్దతిగా చీరలు కట్టిన ఇందులో అయినా అనసూయ అద్భుతంగా ఉంటారు ..మరి ఇంత అందం ఎలా అని అంటే తన బ్యూటీ రహస్యాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ..

నేను హెల్త్ కోసం గ్లాస్ రెడ్ వైన్ తాగుతా. దాంతో పాటు నట్స్ తింటా. వైన్ హెల్త్‌కి, హార్ట్‌కి చాలా మంచిదని తాగుతుంటా. ఏదైనా మితంగా తీసుకుంటే మంచిదే. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు అలాంటి టైంలో నట్స్, వైన్ తీసుకుంటా. నా ఆహార పద్దతులు మారితే వైన్ ‌ని రీ ప్లేస్ చేస్తా. నట్స్ అంటే పిస్తా, పీ నట్స్, వాల్ నట్స్ తింటూ ఉంటా. ఈ కాంబినేషన్ అందరికీ పనిచేస్తుందని నేను గ్యారంటీ ఇవ్వడం లేదు కాని.. నాబాడీకి దాంతో అమైజింగ్ రిలేషన్ ఉంది’ అంటూ తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పుకొచ్చింది అనసూయ.

నేను యాంకర్‌ని అవుతానని మాత్రం అనుకోలేదు. నువ్ ఏం అవుతావ్ అని అంటే ఎయిర్ హోస్టెస్ లేదా మోడల్ అని చెప్పేదాన్ని. ఎందుకంటే.. చాలా మంది నన్ను చాలా బాగుంటావు.. చాలా పొడవుగా ఉన్నావు. బాగున్నావు.. నీ జుట్టు బాగుంది పొగుడుతూ ఉండేవారు అందుకు ఆ రంగం వైపు వెళ్లాలని అనుకునేదాన్ని.. కాని చివరికి అనుకోకుండా ఇలా యాంకర్‌ని అయిపోయా’ అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ అనసూయ.

Tags :
|
|

Advertisement