Advertisement

  • సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన అనసూయ

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన అనసూయ

By: chandrasekar Fri, 14 Aug 2020 3:47 PM

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన అనసూయ


సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ స్పందించారు. దేశంలోని ప్రతి సినీ ఇండస్ట్రీలోను అవకాశాల పేరుతో అమ్మాయిలను లొంగ దీసుకుంటున్నారని, సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పి కొందరు సినీ ప్రముఖులు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయి.

ఇండస్ట్రీలో ఎందరో నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై స్పందిస్తూ చిత్రసీమలో ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ బ్యూటీ అనసూయ కాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై అలరిస్తూ భారీ పాపులారిటీ కూడగట్టుకుంటున్న అనసూయ తన కెరీర్ ఆరంభం నుంచి నేటివరకు ఎదుర్కొన్న పరిస్థితులపై రియాక్ట్ అయింది.

చదువులు ఎంబీఏ హెచ్‌ఆర్ పూర్తి చేసిన తాను ఎలాంటి ప్లాన్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, యాంకర్‌గా స్టార్ట్ అయిన తన ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకైతే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, తన బలాన్ని నమ్ముకొనే తాను ముందుకెళ్లానని ఆమె పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండొచ్చు కానీ అది అమ్మాయి నేచర్ మీదే డిపెండ్ అయి ఉంటుందని అనసూయ అంటోంది.

సినీ ప్రముఖులు ఓ క్యారెక్టర్ ఆఫర్ చేస్తా అని ఎవరైనా ఏదన్నా అడిగితే ఈ ఆఫర్ రావాలంటే ఇతను ఇలా అడుగుతున్నాడు ఇది కాకపోతే దీనమ్మ క్యారెక్టర్ వస్తుందని డ్రాప్ కావచ్చు కదా! అలా డ్రాప్ కాని ఆడవాళ్ళే ఈ క్యాస్టింగ్ కౌచ్‌కి బలైపోతున్నారంటూ అనసూయ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. మీరు మీ టాలెంట్‌ని నమ్ముకోండి. బయట కాంపిటేషన్ లేదని చెప్పడం లేదు. నేను చేసే క్యారెక్టర్స్‌ నా కంటే బాగా చేసే ఇంకో పది మంది ఉండొచ్చు కానీ, మీ టాలెంట్‌ని మీరు నమ్ముకోండి. నేనూ చాలా మిస్ అయ్యాను మరియు ఫేవరేటిజం అనే దానికి బలయ్యాను.

ఈ విషయంపై ఎప్పుడూ బయటకు చెప్పలేదు రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా. రెండేళ్ల క్రితం ఓ గ్రూప్ ఫేవరేటిజం వల్ల నేను కూడా అవకాశాలు కోల్పోయాను. అయినా నా టాలెంట్‌నే నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. ఈ క్యారెక్టర్ అనసూయ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడాలి. లైఫ్‌లో ఆ టార్గెట్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్‌ కాదు కదా క్యాస్టింగ్ పిల్లో కూడా రాదు అంటూ తన అనుభవాలను అనసూయ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Tags :
|

Advertisement